ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన కలెక్టర్, ఎమ్మెల్యే

70చూసినవారు
మెరుగైన సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ రాజార్షిషా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్