బేల మండలంలో గురువారం కలెక్టర్ రాజర్షిషా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బేల గ్రామపంచాయితీ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు
అనంతరం సైద్ పూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొని మెడిసిన్ స్టాక్ రూమ్, వ్యాక్సిన్ స్టోరేజ్ రూమ్ లను తనిఖీ చేశారు. అంతకుముందు చిన్నుగుడ లో ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు.