శిథిలావస్థకు చేరిన పాత భవనాలను పరిశీలించిన కమిషనర్

76చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన భవనాల కూల్చివేతకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం స్థానిక అశోక్ రోడ్ ఏరియాలలో ఉన్న పాత భవనాలను కమిషనర్ ఖమార్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా యజమానులతో మాట్లాడి ప్రమాదం సంభవించక ముందే భవనాలను ఖాళీ చేయాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్