వినాయక చవితి సమీపిస్తున్నందున ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం తరపున అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ ఖమర్ అహ్మద్ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో బుధవారం మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో కమిషనర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని సూచించారు.