ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దయాకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చెల్లించాలన్నారు. రైతు భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామన్నారు.