బుద్దిస్ట్ పర్సనల్ లా పై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు గానూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ లో గల అశోక్ బుద్ధ విహార్ లో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు మధు బావల్కర్ తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 22న నిర్వహించనున్న సదస్సుకు బుద్దిస్ట్ లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.