ఘనంగా రిమ్స్ నర్సింగ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే

56చూసినవారు
నర్సింగ్ సిబ్బంది అందించే సేవలు అత్యంత అమూల్యమైనవి అని, రోగుల ప్రాణాలు నిలబెట్టడానికి వారు చేసే కృషి వెలకట్టలేనిదని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ అన్నారు. రిమ్స్ నర్సింగ్ కళాశాల 2019-20 బ్యాచుకు చెందిన విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డేను ఆడిటోరియంలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పట్టాలను పంపిణీ చేశారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు అశోక్, ప్రిన్సిపల్ అనిత తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్