ఆదిలాబాద్: బండి సంజయ్ వ్యాఖ్యలు ఖండించిన కాంగ్రెస్

56చూసినవారు
ఆదిలాబాద్: బండి సంజయ్ వ్యాఖ్యలు ఖండించిన కాంగ్రెస్
పద్మ అవార్డు ఎంపిక నేపథ్యంలో గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఆత్రం సుగుణ తీవ్రంగా ఖండించారు. ఉట్నూర్‌లో మీడియతో మాట్లాడారు. తెలంగాణ కోసం, పీడిత, పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం గద్దర్ పోరాడారని గుర్తు చేశారు. గద్దర్ జీవితం గురించి బండి సంజయ్ తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన గద్దర్ స్థాయి తగ్గదన్నారు.

సంబంధిత పోస్ట్