ఆదిలాబాద్ లోని ఖానాపూర్ చెరువు ప్రాంతంలో ఉన్న కొన్ని ఇళ్లకు హైడ్రా పేరుతో మార్కింగ్ లు వేసి పేదలను భయాందోళనలకు గురిచేస్తున్న విషయంలో వెంటనే ఆ ప్రక్రియ ఆపాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు జహీర్ రంజాని, బండారి సతీష్ కోరారు. ఈ విషయమై కమిషనర్ ఖమర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. చెరువు తిరిగి ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు ఇమ్రాన్ ఉన్నారు.