ఆర్టిస్టుల సంక్షేమం కొరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

55చూసినవారు
ఆర్టిస్టుల సంక్షేమం కొరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి సమావేశాన్ని ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రాజేశ్వర్ పాల్గొని మాట్లాడారు. చిత్ర కళాకారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణలోని ఆర్టిస్టులను ప్రభుత్వం గుర్తించి ఆర్టిస్టుల సంక్షేమం కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. నిరుపేదలైన ఆర్టిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్