జైనూర్ మండలంలోని ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం, హత్యాయత్నం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. మహిళల పట్ల ఇలాంటి దారుణానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళపై దాడి చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని, అట్రాసిటీ కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలని కోరారు.