దుండగులను కఠినంగా శిక్షించాలి

54చూసినవారు
అత్యాచరాలు చేసిన దుండగులను ఉరి తీయాలని టైగర్ గ్రూప్ అధ్యక్షుడు జాదవ్ గోపాల్ డిమాండ్ చేశారు. ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలో మూడేళ్ల పాపపై జరిగిన లైంగిక దాడిని
ఖండిస్తూ బుదవారం స్థానిక కొమరం భీం చౌక్ లో నిరసన తెలిపారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు బట్టు మహేష్ శశికాంత్, తౌఫిక్, షాహెబజ్, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్