ధర్మ సమాజ్ పార్టీ సమావేశం

82చూసినవారు
ధర్మ సమాజ్ పార్టీ సమావేశం
ధర్మ సమాజ్ పార్టీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల సమీక్ష సమావేశాన్ని ఆదివారం ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు గణేష్ అధ్యక్షత వహించారు. ఉమ్మడి జిల్లా రీజనల్ ఇంచార్జి సుమన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలో పార్టీ సభ్యత్వాలను వేగవంతం చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. సమావేశంలో నిర్మల్ జిల్లా పార్టీ అధ్యక్షులు రవీందర్, తదితరులున్నారు.