మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలతో పాటు ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బల్దియా కార్యాలయం ఎదుట మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులకు కనిష్ట వేతనం రూ. 26 వేలు చెల్లించాలని ఆన్నారు. కార్మికులకు సెలవులు మంజూరు చేయాలన్నారు.