ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

68చూసినవారు
జైనూర్ లో ఆదివాసి మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆదివాసి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నినాదాలతో హోరెత్తించారు. తుడుందెబ్బ జిల్లా కో కన్వీనర్ వెట్టి మనోజ్ మాట్లాడుతూ జైనూర్ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్