ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ వార్డ్ నంబర్ 34 లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన 22 మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను శుక్రవారం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, జూనియర్ అకౌంటెంట్ కార్తీక్, కౌన్సిలర్ జోగు ప్రేమేందర్ 34 వ వార్డ్ మైనారటి ఇందిరమ్మ కమిటీ సభ్యులు మన్సూర్, బీసీ కమిటీ సభ్యులు మోర ఆశన్న, అంగన్వాడీ సభ్యురాలు లలిత, 22 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.