రోడ్డు ప్రమాదంలో తమతోపాటు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. అదిలాబాద్ కు చేరుకున్న తర్వాత ఒక వీడియోస్ సందేశంలో ఆయన మాట్లాడుతూ. అభిమానులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని కోరారు. ఆదిలాబాద్ లో పత్తి రైతులు జరుగుతున్న ధర్నాను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ లో మీటింగ్ ను పూర్తిచేసుకుని వస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు