అంగన్వాడి సెంటర్ కు కుర్చీలు అందజేత

51చూసినవారు
అంగన్వాడి సెంటర్ కు కుర్చీలు అందజేత
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అర్లి (బి) గ్రామంలోని అంగన్వాడి సెంటర్ కు బిజెపి నాయకులు గోపాతి ఆశా రెడ్డి చేయూత అందించారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లల సౌకర్యార్థం 15 కుర్చీలను తన వంతుగా శుక్రవారం అందజేశారు. అంగన్వాడి సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను అభినందించారు. అంగన్వాడీ టీచర్ పాలెపు మౌనిక విఠల్, ప్రమోద్, రాజు , సందీప్ ఉన్నారు

సంబంధిత పోస్ట్