ఆసిఫాబాద్ గ్రామీణ మండలంలోని గుండి గ్రామస్థులు గత నెల నుంచి మంచినీరు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉన్న నీటి, రోడ్డు, విద్యుత్తు సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, మల్లేష్, చరణ్, దత్తు తదితరులు పాల్గొన్నారు.