ప్రతి డ్రైవర్ దృష్టిలోపం లేకుండా చూసుకుంటూ, తమ కళ్లను కాపాడుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్ సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆదిలాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఆటో, స్కూల్ బస్, ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లకు రవాణా శాఖ ఆధ్వర్యంలో దుర్గం ట్రస్ట్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డీహెంఎచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తదితరులున్నారు.