జైనథ్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

66చూసినవారు
జైనథ్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
జైనథ్‌ పోలీస్‌ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్. జీవన్‌ రెడ్డి మంగళవారం సందర్శించారు. పోలీసు స్టేషన్‌ను పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు, ఛార్జ్‌షీట్‌ ఫైళ్లతో పాటు రికార్డులను పరిశీలించారు. కోర్టు కేసుల పురోగతిని పెండింగ్‌ కేసులను వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ వెంట జైనథ్‌ సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్