ఆదివాసి తొమ్మిది తెగలలో అట్టడుగున ఉన్న పర్దాన్, తోటి, కొలం, నాయక్ పోడ్, ఆంద్, మన్నేవార్ తెగలకు రాజకీయ పార్టీలు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోలం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భీం రావ్ కోరారు. బుదవారం ఆదిలాబాద్ లోని యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయిదు తెగల ప్రతినిధులు పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. నేతలు సట్ల అశోక్, పాండురంగ్, దుర్వ నగేష్, నైతం రమేష్, తులసి బాయి ఉన్నారు