రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తూ. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రజాసేవ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను, కుల సంఘాలకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.