కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి

72చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 9 లో అంబిక నగర్ కాలనీలో ఎమ్మెల్యే పాయల శంకర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. కాలనీలో కలయ తిరుగుతూ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలపై కాలనీవాసులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. కాలనీలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలని విన్నవించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్