గ్రేడ్ వన్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని వాల్మీకి నగర్ కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అమృత్ పథకం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.