ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా డీఎంహెచ్ఓగా వచ్చిన డాక్టర్ కృష్ణను జిల్లా ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం (3134) నాయకులు, ఎస్సీ, ఎస్టీ వైద్య ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాథోడ్ బాబూలాల్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి సన్మానించారు. ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు.