రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం ఓ ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని కలెక్టర్ చౌక్ వద్ద వాహనదారులకు పువ్వులు, చాక్లెట్లు ఇస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అవగాహన కల్పించారు. కాగా విద్యార్థులను సీఐ అభినందించారు.