ఈ నెల 11న ఈదుల్ ఫితర్ వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి బుధవారం సందర్శించారు. ఈద్గాకు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈదుల్ ఫితర్ వేడుకలను ప్రతిఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అయన వెంట మైనార్టీ నాయకులు ఉన్నారు.