ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. భోరజ్ మండలం తరోడలో నిర్వహిస్తున్న భూ భారతి సదస్సుకు బుధవారం ఆయన హాజరై రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి భూ సమస్యలున్నా పరిష్కరించుకోవాలని కోరారు. భూభారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆయనతో పాటు భీంపూర్ తహశీల్దార్ నలందప్రియ ఉన్నారు.