ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

77చూసినవారు
ఆదిలాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులు అందరినీ 108 అంబులెన్స్లలో రిమ్స్ తరలించారు. వీరంతా ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందినవారు. బైంసా నుండి ఆదిలాబాద్ కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్