ఆదిలాబాద్: రిమ్స్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి

80చూసినవారు
ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై శనివారం రైమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రిమ్స్ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలన్నారు. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఆసుపత్రిలోని లిఫ్ట్ ను పునర్దరించాలని కోరారు. ఆయన వెంట ఏఐటీయూసీ నాయకులు రాములు ఉన్నారు.

సంబంధిత పోస్ట్