ప్రశాంతత నెలకొల్పేందుకు, ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉట్నూర్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ద్వారా గురువారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనవకుండా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎలాంటి బంద్ లేదని, బంద్ ఉందంటూ ప్రచారం చేసిన, బంద్ నిర్వహించాలని సంచరించిన వారిపై చర్యలు తీసుకోబడతాయన్నారు.