మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై సుదీర్ఘంగా కేసీఆర్ తో ఆయన చర్చించారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులను వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేసీఆర్ సూచించినట్లు మాజీ మంత్రి తెలిపారు.