ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు న్యాక్ ద్వారా మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు న్యాక్ ఇన్చార్జి రమేశ్ తెలిపారు. ఎలక్ట్రిషన్, హౌజ్ వైరింగ్, ప్లంబింగ్, సానిటేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, ఆసక్తిగల వారు ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.