గాదిగూడ: 'రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలి'

70చూసినవారు
గాదిగూడ: 'రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలి'
గాదిగూడ మండలంలోని షేకుగూడ గ్రామస్థులు సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. మండలంలోని పిప్రి నుండి కుండి షేకుగూడ వరకు రోడ్డు మంజూరైందని వివరించారు. దీంతో రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అధికారుల అనుమతులు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో కోట్నక్ సక్కు, భీంరావు, పరశురామ్, బాధిరావు, ఆనందరావు, నాగోరావ్, రాజు, సీతారాం తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్