గాదిగూడ: 'బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలి'

72చూసినవారు
గాదిగూడ: 'బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలి'
గాదిగూడ మండలంలోని పిప్రి గ్రామంలో గురువారం రైతులపై పిడుగు పడడంతో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు క్షతగాత్రులు ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో శుక్రవారం ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ వారిని పరామర్శించారు. అనంతరం పిడుగుపాటుతో మరణించిన బాధిత ఆదివాసీ కుటుంబాలకు రూ. 50 లక్షలు ఇచ్చి, కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్