భూ కబ్జాకు పాల్పడిన ముఠా సభ్యులు అరెస్ట్

0చూసినవారు
భూ కబ్జాకు పాల్పడిన ముఠా సభ్యులలో కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ లోని కే. ఆర్. కే కాలనీలో బాధితురాలు పోసాని ప్లాటును నిందితులు కబ్జా చేసి, ఆమెను బెదిరించారని చెప్పారు. వీరిలో మాజీ కౌన్సిలర్ కుమారుడు ఆనంద్‌తో పాటు 8 మంది ఉన్నారన్నారు. బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేయగా. మావల పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్