ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించగా. తోటి విద్యార్థులు కేరింతలు చప్పట్లతో వారిని ఉత్సాహపరిచారు. సినీ గీతాలకు అనుగుణంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపాల్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కళాశాలతో తమకు ఉన్న అనుబంధాన్ని సీనియర్ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు