దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే భుక్తపూర్ 7వ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ అనుముల్ వార్ కవిత ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కాలనీ వాసులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర ఉద్యమాల గురించి చర్చించారు.