బేల మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో విశ్వహిందూ పరిషత్ టౌన్ అధ్యక్షుడు ఉప్పల్ వార్ నారాయణ్ మువ్వన్నెల జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ హరీష్ రెడ్డి పేర్కొన్నారు.