గుడిహత్నూర్: ఇండ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్‌ తీగలు

69చూసినవారు
కరెంట్‌ తీగలతో ప్రమాదం పొంచి ఉండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్‌ తీగలు ఇండ్లకు అనుకొని పోవడంతో ఇండ్లపై ప్రమాదకరంగా తీగలు వేలాడుతున్నాయి. మండలంలో రెండు రోజుల నుంచి ఈదురు గాలుల, భారీ వర్షాలకు ఈ సమస్య వచ్చిందని కాలనీవాసులు పేర్కొన్నారు. తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి, మరమ్మతులను చేపట్టాలని బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్