గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పెంచాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కాంబ్లే విజయ్ కుమార్ కోరారు. ఈ విషయమై ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలసి వినతి పత్రం అందజేశారు. మీ సేవ నుండి దృవీకరణ పత్రాలు సరైన సమయంలో అందకపోవడంతో చాలామంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారన్నారు. అదే విధంగా కుల ధ్రువీకరణ పత్రాలు త్వరగా మంజూరు చేయాలని కోరారు.