హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ లోని విజయ హనుమాన్ ఆలయం నుండి శుక్రవారం శోభాయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ మేరకు మఠాధిపతి యోగానంద సరస్వతి తో కలిసి యాత్రను ప్రారంభించారు. హనుమాన్ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంలో ఉంచి యాత్రను ప్రారంభించారు. అదేవిధంగా హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.