జైనూర్ లో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరారు. జైనూరు ఘటనలో పోలీసు యంత్రాంగం కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. వదంతులను ప్రచారం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు