ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వార గత 17 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆశన్న అన్నారు. ఆరోగ్య మిత్రల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆరోగ్య మిత్రలకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.