పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యం: పిడి

76చూసినవారు
పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యం: పిడి
పోషణ మాసోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ లోని సుందరయ్యనగర్ లో పోషణ అభియాన్ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ సబిత, అర్బన్ సిడిపిఓ వనజ పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారని పేర్కొన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్త రాధ ఆధ్వర్యంలో చిరుధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సూపర్వైజర్ ఫర్హా, ఏఎన్ఎం తులసి ఉన్నారు.

సంబంధిత పోస్ట్