ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి వాతావరణం చల్లగా ఉండగా. తేలికపాటి జల్లులు కురిసాయి. సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో మార్కెట్ ప్రాంతంలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా పలు మండలాల్లో సైతం వర్షం కురుస్తున్నది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.