ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షంతో వాతావరణంలో తక్షణ మార్పులు సంభవించాయి. తీవ్ర వేడిమి నుండి ఉపశమనం లభించడంతో వాతావరణం చల్లబడింది. వర్షం రావడం వ్యవసాయదారుల ముఖాల్లో ఆనందాన్ని నింపింది. పలు చోట్ల రైతులు దుక్కులు దున్నడం మొదలు పెట్టారు.