వికారాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సాయంత్రం ఒక్కసారిగా పెద్దఎత్తున ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలో పలుచోట్ల వడగండ్లతో కూడిన వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. పలు గ్రామాల్లో రేకులు లేచిపోవడంతో పాటు, విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.