బేల మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మండలంలోని సాంగ్వీ, సైదుపూర్, గ్రామపంచాయతీ పరిధిలో సాంగ్వీ, పాట గుడా, జామడ సైదుపూర్ గ్రామాలలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాధారణ వాతావరణం ఉండగా మధ్యాహ్నం సమయంలో ఒకేసారి వాతావరణం మారి మేఘావృతం అయింది. దీంతో భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షంతో కాస్త ఊరట లభించింది.